వెల్కటూరు లో మారకమ్మ దేవత విగ్రహం..
వెల్కటూరులో మారకమ్మ దేవత విగ్రహం..
చరిత్రను కాపాడుకోవాల్సిన సమయం ఇది.
సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరులో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన మారకమ్మ దేవత విగ్రహం ప్రస్తుతం ఎలాంటి రక్షణ లేకుండా ఉంది.
కాకతీయుల కాలంలో 1225 జూన్ 14న వెల్కటూరు గ్రామంలో మారకమ్మ దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు విగ్రహ పీఠంపై చెక్కబడిన శాసనం ఆధారంగా గుర్తించబడింది. చరిత్రకారుడు Srinivas Yadav Kolipaka గారు శుక్రవారం పరిశీలించి, దీనికి తక్షణ రక్షణ అవసరమని స్పష్టం చేశారు.
ఈ విగ్రహం గతంలో రోడ్డు పక్కన భూమిలో కూరుకుపోయి ఉండేదని, గుడి కట్టడం కోసం బయటకు తీసినప్పుడు ముక్కు భాగం ధ్వంసం కావడంతో ప్రతిష్ఠించకుండా అలాగే వదిలేశారని తెలిపారు.
ఇప్పటికైనా గ్రామ ప్రజలు, చరిత్రలో ఆసక్తి ఉన్నవారు, ప్రభుత్వ అధికారులు కలిసి ఈ విగ్రహానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
#Velkatoor #Siddipet #HistoricalHeritage #MarakammaDevi #KakatiyaDynasty #KolipakaSrinivas #ProtectOurHistory
@highlight See less
— at Velkatur.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి