“ఉగాది… నూతన జీవిత ప్రారంభం” కవిత
ఉగాది… పండుగ ప్రారంభం.. 🌿🌿🍀🍀 🍯🍯
ఉగాది… పండుగ ప్రారంభం
ఉదయం సూర్యుని వెలుగు కాంతులతో…
ఇంటిని పరిశుభ్రత, స్వచ్ఛతతో…
ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో…
కుటుంబ సభ్యుల ఆనందాలతో…
ఉగాది పచ్చడి షడ్రుచుల తీయని సంబరంతో…
నూతన సంవత్సర వెలుగులతో…
గ్రామ గ్రామాల సంతోషాలతో…
ఆధ్యాత్మిక వ్యక్తిగత అనుభవాలతో…
దేవాలయాల్లో పంచాంగ వినికిడి సందర్శనతో…
భవిష్యత్తు కాల నిర్ణయ ఆలోచనలతో…
వ్యాపార, ధనలాభాల విశిష్టతతో…
మన రాశుల, జన్మ నక్షత్రాల భావి అనుభవాలతో…
పంచాంగంలో చూపించే
ఆదాయం – వ్యయం – రాజపూజ్యం – అవమానం
మన గణనల విశేషాలతో…
పురోహితుల ఉగాది పంచాంగ నూతన వివరాలతో…
పంచాంగ విశేషాలపై సమూహ ముచ్చట్లతో…
ఉగాది… ఒక నూతన సంవత్సర వెలుగుతో…
మళ్లీ కాలచక్రం తిరుగుతూ
ముగింపులో మరో ప్రారంభం అవుతూ…
ఉగాది ప్రారంభం…
మళ్లీ నూతన జీవిత వెలుగులతో…
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి